వర్షాధార పంటలు, బీడు భూముల పరిస్థితి నుంచి సాగునీటి సౌకర్యం, ఉచిత 24 గంటల విద్యుత్, రైతుబంధు వంటి రైతు సహాయ పథకాలతో వ్యవసాయరంగ స్వరూపమే మారిపోయింది. అనూహ్య వరి ఉత్పత్తితో రాష్ట్రం ‘అన్నపూర’్ణగా మారిపోయింది. 2014-15లో వరి 1.41 కోట్ల ఎకరాల్లో సాగయితే, ప్రస్తుతం 2.13 కోట్ల ఎకరాలకు చేరుకున్నది.
కేంద్రం అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ రైతుల పట్ల వివక్ష చూపుతున్నది. తెలంగాణలో వర్షాధార భూములను సస్యశ్యామలం చేసుకొని రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిస్తుంటే.. దొడ్డు బియ్యం కొనబోమని కేంద్రం అంటున్నది. దేశంలో వరిసాగు పంజాబ్ తర్వాత అత్యధిక విస్తీర్ణంలో చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. 2014 నుంచి నేటికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం రెండింతలైంది. రైతుల నుంచి వడ్లు సేకరిస్తున్న రాష్ట్రాల్లో రెండో అతిపెద్ద సేకరణ రాష్ట్రం తెలంగాణ.
ఏండ్ల తరబడి ఒకే పంటను అదే నేలలో పండిస్తే అనర్థాలనేకం. ఇది పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో ఇప్పటికే అనుభవంలోకి వచ్చింది. గుజరాత్లో వేరుశనగ పరిస్థితీ ఇదే. పలు రాష్ర్టాలు ప్రత్యామ్నాయ పంటలు, పంటల వైవిధ్యీకరణ వైపు దృష్టి సారిస్తున్నాయి. తెలంగాణ రైతులు కూడా ఈ దిశగా అడుగులు వేయాలి.
రాష్ట్రంలోని వానకాలం, యాసంగి కలిపి 1.5 కోట్ల టన్నుల దొడ్డు బియ్యం పండిస్తారు. ఈ ధాన్యం పండించే 21 లక్షల మంది రైతులకు కనీస మద్దతు ధరలు అందితే లాభం చేకూరుతుంది. అదనంగా దొడ్డు బియ్యం రాష్ట్రం నుంచి సేకరించాలని కేంద్రాన్ని కోరినా ఒప్పుకోవడం లేదు. బాయిల్డ్ రైస్ విషయంలోనూ అదే ధోరణి. యాసంగిలో పంజాబ్ నుంచి ఒక కోటి 13 లక్షల టన్నుల ఉడుకబెట్టిన బియ్యం సేకరిస్తే , తెలంగాణ నుంచి 25 లక్షల టన్నులే సేకరిస్తామంటున్నది. ఈ వానకాలంలో రాష్ట్రంలో 55 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తే, 1.40 కోట్ల టన్నుల ధాన్యం పండనున్నది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 65 లక్షల టన్నులు మాత్రమే కొనటానికి సిద్ధంగా ఉన్నది. మరి మిగిలిన 80 లక్షల టన్నులు ఎవరు కొనాలి? తమిళనాడు, కేరళ, కర్నాటకలు గత సీజన్లో తెలంగాణ నుంచి వడ్లు, బియ్యం కొనేవి. స్థానికంగా ఆయా రాష్ర్టాల్లో సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరగటం తో క్రమంగా కొనుగోళ్లు తగ్గించాయి. రాష్ట్రంలోని మిల్లర్లు యూపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో తక్కువ ధరకే వరి ఉత్పత్తులు వస్తుండటంతో అటే మొగ్గుచూపుతున్నారు. ఎగుమతులు కూడా రాష్ట్రం నుంచి అంతంత మాత్రమే.
రాష్ట్రంలో బియ్యం వినియోగమే ప్రత్యామ్నాయం. 3.81 కోట్ల జనాభాకు 27.85 లక్షల టన్నుల బియ్యం కావాలి. అందుకు 40 లక్షల టన్నుల వడ్లు పండించాలి. 33 శాతం అదనంగా కలుపుకొంటే 53 లక్షల టన్నుల వడ్లు పండించాలి. ఎఫ్‌సీఐ సేకరిస్తానని హామీ ఇచ్చింది మరో 60 లక్షల టన్నులే. అంటే మొత్తం 113 లక్షల టన్నులు వడ్లు కావాలి. రాష్ట్రంలో వరి సరాసరి దిగుబడి ఎకరానికి 2 టన్నులు. దీని చొప్పున 56.50 లక్షల ఎకరాలలో వరి పండిస్తే సరిపోతుంది. అంటే రెండు సీజన్లలో కలిపి పండించే వరి విస్తీర్ణంలో సగం పండిస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో వరి విస్తీర్ణం తగ్గించుకోవటమే పరిష్కారమా? లేదంటే ఇదే స్థాయిలో విస్తీర్ణం కొనసాగితే వరి ఉత్పత్తి పెరిగి అమ్మకంలో సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉన్నది.
వర్షాధార పంటలు, బీడు భూముల పరిస్థితి నుంచి సాగునీటి సౌకర్యం, ఉచిత 24 గంటల విద్యుత్, రైతుబంధు వంటి రైతు సహాయ పథకాలతో వ్యవసాయరంగ స్వరూపమే మారిపోయిం ది. అనూహ్య వరి ఉత్పత్తితో రాష్ట్రం ‘అన్నపూర’్ణగా మారిపోయింది. 2014-15లో వరి 1.41 కోట్ల ఎకరాల్లో సాగయితే, ప్రస్తుతం 2.13 కోట్ల ఎకరాలకు చేరుకున్నది.
ఏండ్ల తరబడి ఒకే పంటను అదే నేలలో పండి స్తే అనర్థాలనేకం. ఇది పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో ఇప్పటికే అనుభవంలోకి వచ్చింది. గుజరాత్లో వేరుశనగ పరిస్థితీ ఇదే. పలు రాష్ర్టాలు ప్రత్యామ్నాయ పంటలు, పంటల వైవిధ్యీకరణ వైపు దృష్టి సారిస్తున్నాయి. తెలంగాణ రైతులు కూడా ఈ దిశగా అడుగులు వేయాలి. అపరాలు, నూనెగింజలు సాగు చేస్తే లాభదాయకం. ఇప్పటికీ దేశంలో అవసరాలకు సరిపోను నూనెలు, పప్పుధాన్యాలు లేక విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. రూ.80 వేల కోట్లకు పైగానే నూనెలు, పప్పుధాన్యాల దిగుమతులకు ఖర్చు చేస్తున్నాం. దేశీయంగా పప్పుదినుసులు, నూనెగింజల పంట లు సాగుచేయడానికి అనుకూల వాతావరణం ఉన్నది. మేలైన రకాలు అందుబాటులో ఉన్నాయి. పంటల మార్పిడికి కచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఈ పంటలను ఎన్నుకోవటం ఉత్తమం.
తెలంగాణలో అపరాలు, నూనెగింజల సాగుతో లాభాలున్నాయి. వేరుశనగ సాగుతో ఎకరానికి రూ.7,010, మినప రూ.3,991, పెసర రూ.28 54, కంది రూ.2,774, సో యాబీన్ రూ.3,607, పొద్దుతిరుగుడు రూ.2,964, నువ్వుల సాగుతో రూ.523 ఎకరానికి అదనంగా మిగులుతున్నాయని సీఏసీపీ 2021-22 వానకాలం నివేదిక చెప్తున్నది. పంజాబ్, హర్యానా, యూపీల నుంచి వరి, గోధుమలు సైతం ఎక్కువ సేకరిస్తున్న ఎఫ్‌సీఐ, కేవలం వడ్లను మాత్రమే ఉత్పత్తి చేసే తెలంగాణపై పరిమితులు విధించటం వివక్ష. రాష్ట్ర అవసరాలు, ఎఫ్‌సీఐ సేకరణకు కలిపి అవసరమయ్యే వడ్లను వానకాలం వరకే వరి సాగును పరిమితం చేయాలి. తెలంగాణ సోనరకం తప్ప మిగిలిన సన్న వడ్ల రకా లు ధీర్ఘకాలిక రకాలు. అవి వానకాలంలోనే సాగు చేసుకోవచ్చు. యాసంగిలో దొడ్డు రకాలు సాగు చేయాలి. కానీ వాటికి మార్కెట్ లేదు. అందువల్ల యాసంగి 52.82 లక్షల ఎకరాలలో అసలు వరి వేయకపోవటమే మేలు. బదులుగా పంట మార్పిడితో అపరాలు, నూనె గింజలు, విత్తన పంటలు, కూరగాయల సాగు చేస్తే రైతులకు గిట్టుబాటు ధరలు అందుతాయి. ప్రత్యామ్నాయ పంటలే అన్ని సమస్యలకు పరిష్కారం.
మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి
91827 77036