తెలంగాణ సారస్వత పరిషత్తు కవితా, కథారచన పోటీల విజేతలను ప్రకటించింది. పరిషత్తు కార్యాలయంలో నవంబర్ 19న 11గంటలకు విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. రూ.5 వేలు ప్రథమ, రూ.3 వేలు ద్వితీయ, రూ.2 వేలు తృతీయ బహుమతులుగా అందజేస్తారు. ప్రత్యేక బహుమతిగా రూ.వెయ్యితో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేస్తారు.
కవితా రచనలో: జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలకు చెందిన ఇ.రాందాస్‌నాయక్ ప్రథమ బహుమతి, వరంగల్ జిల్లా (ఎల్కతుర్తి) రాసమల్ల అక్షయ ద్వితీయ, దిల్సుఖ్నగర్ వివేక్‌కృష్ణ తృతీయ బహుమతులకు ఎంపికయ్యారు.
ప్రత్యేక బహుమతులు: బి.స్వప్న (నారాయణపేట జిల్లా పులిమామిడి), కయ్యాల అక్షయ (మహబూబాబాద్ జిల్లా మరిపెడ), ఋషి సంహిత (మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్), గాజుల హర్షిత (మంచిర్యాల జిల్లా గోపాల్‌నగర్), గడ్డం శ్రావణి (జగిత్యాల జిల్లా బీర్పూర్), యం.సాయిరాం (సిరిసిల్ల), యం.శ్రావణి (సిరిసిల్ల జిల్లా చంద్రంపేట), కోట యువరాజు (ఖమ్మం జిల్లా కలకోట), యం.గంగాదేవి (నిజామాబాద్ జిల్లా తడపాకల్), కె.అంజన (సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి), జి.రమణ (యాదాద్రి జిల్లా చౌటుప్పల్), యం.సారిక (భద్రాద్రి జిల్లా కూనవరం), యం.భావన (మెదక్), బి.శ్వేత (మేడ్చల్ జిల్లా గాజులరామారం), చిత్రకవి నాగహాసిని (సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం) ఎంపికయ్యారు.
కథా బహుమతులు: బి.స్వప్న (నారాయణపేట జిల్లా పులిమామిడి)కు ప్రథమ బహుమతి, బి.శ్రీహిత (నిజామాబాద్ జిల్లా ముబారక్‌నగర్)కు ద్వితీయ, జోలం మాధురి (నల్లగొండ జిల్లా వల్లాల)కు, కె.స్ఫూర్తి (మెదక్ జిల్లా తూప్రాన్)కి తృతీయ బహుమతులు లభించాయి.
ప్రత్యేక బహుమతులు: కె.తనూజ (నిజామాబాద్ జిల్లా ముబారక్‌నగర్), యం.గంగాదేవి (నిజామాబాద్ జిల్లా తడపాకల్), కె.ఉదయకిరణ్ (సంగారెడ్డి జల్లా ఐడీఏ బొల్లారం), సీహెచ్ హరిచందన (నల్లగొండ జిల్లా మిర్యాలగూడ), యన్.నిఖిత (నల్లగొండ జిల్లా, వెంకిర్యాల) అమృతహాసిని (హైదరాబాద్), చింతలపూడి అంజలి (మౌలాలి), కె. ప్రవీణ్, టి.దీపిక (మెదక్ జిల్లా వెంకటాయపల్లి), సింధు (రంగారెడ్డి జిల్లా మాలికదానిగూడ), యం.గోపాల్ (రంగారెడ్డి జిల్లా మహేశ్వరం), కె.అనూష (కరీంగనర్ జిల్లా కేశవపట్నం) ప్రత్యేక బహుమతులకు ఎంపికయ్యారు.