మొక్క మరో మొక్కకు జన్మనిచ్చి
మంచి మల్లెచెట్టయి విరబూస్తది
ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్లు
మహోదయాన్ని వెలిగించాలి
జీవితకాలంలో ఒక్క మంచిపనైనా చేసి
చరిత్రకు కావడివి కావాలి..
వేల అడుగులు నడిచిన నేలలో
ఒక్క అడుగన్న అమ్మచెయ్యై ఆసరవ్వాలి
కోటి పున్నమి వెలుగుల కన్నా
ఒక్క అక్షర దీపమే మిన్న..
బండలు పగిలే ఎండల్లో
దోసెడు నీళ్లయి దూప తీర్చాలి
అమ్మ కాలిగాయానికి
ఆకు పసరువు కావాలి
వాలిపోతున్న పొద్దును నిలబెట్టి
‘మన ఊరు-మన బడి’ని వెలిగియ్యాలి
అఆ ఇఈ దిద్దపెట్టిచ్చిన మన ఊరు బడి
జీవిత పాఠాలతో కడుపు నింపిన విజ్ఞాన బడి
అమ్మగుండె పెచ్చులూడి కుంగిపోతుంటే
సర్కారు స్కూల్‌ను నిలబెట్టి
అందరికీ.. అక్షరకాంతులు పంచాలి
అక్షరమే అనంతకాంతి!
(నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ‘ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో రూ.3 కోట్ల నిధులతో తిమ్మాజీపేట్ మండల కేంద్రంలో నిర్మించిన ఉన్నత పాఠశాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించిన సందర్భంగా..)
వనపట్ల సుబ్బయ్య
94927 65358