అతడు బంగారంబుదం దెట్టి విలువను
పరికించి యెఱుగని వైశ్య వరుడు,
కత్తితో శత్రువు కడతేర్చ గలమన్న
చాదస్తములు లేని క్షత్రియుండు,
బ్రహ్మ విజ్ఞానంబు పదిమందికే యను
వర్గీకరణ లేని బ్రాహ్మణుండు,
అణగారి పడియుండు టది నీతి యనుటను
కాలదన్నిన మేటి కార్మికుండు,
క్రీస్తై బుద్ధుడునై మహమ్మదయి
మూకీ భూత దీన ప్రజా
మస్తంబందు కరంబునుంచి అభయం
బందించి అజ్ఞానతా
గ్రస్తంబైన జగంబు జ్ఞానరుచితో
లాలించి ఫాలోపరి
న్యస్తాంభోజ కరాల నవ్వెడి కరంచందున్ స్తుతిన్ జేసెదన్.
– దాశరథి