వడగాల్పులు తీవ్రంగా ఉన్నాయి. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ చేసిన హెచ్చరికకు బీజేపీ నాయకులు బాగానే స్పందించినట్టుఉన్నారు. ఎందుకంటే ఆ పార్టీ నేతలు ఎవర్ని చూసినా నెత్తిన గుడ్డ వేసుకొని కనిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే వీరు.. హెల్త్ డైరెక్టర్ హెచ్చరికలను మాత్రం బాగానే ఫాలో అవుతున్నారని ఆ పార్టీ నాయకుడు ఒకరి వద్ద ప్రస్తావిస్తే.. వడదెబ్బనా పాడా.. రోజురోజుకు పెరుగుతున్న ధరలకు జనానికి ముఖం చూపెట్టలేక నెత్తిన గుడ్డేసుకొని తిరుగుతున్నట్టు చెప్పారు. నిజం చెప్పండి.. మరీ మీ పార్టీ మీద మీరే జోకులా? లేక ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారా? అడిగితే మమ్మల్ని నమ్మి ఓటు వేయడమే పెద్ద ఫూల్. అంతకుమించిన ఏప్రిల్ ఫూల్ మరొకటి ఏముంటుందని సదరు నాయకుడు ఇచ్చిన సమాధానానికి ఎవరైనా ఫూల్ కాకతప్పదు.