శుష్కించిన దేహాలకు
అచేతనపు ఆయువులకు
ఆర్థిక స్తోమత లేని జనులకు
నాణ్యమైన సేవలందించే
విశ్వసనీయత కేంద్రాలు
బస్తీ దవాఖానాలు…
ఖరీదైన కార్పొరేట్ చికిత్సకు నోచుకోలేని
అభాగ్యులకూ పరిరక్షణ ఇచ్చి
నమ్మకమైన భరోసా కలిగించే
దైవ మందిరాలు బస్తీ దవాఖానాలు…
ఏ వ్యాధికి కూడా నిర్ధారణ పరీక్షలు
చేయించుకోలేని ప్రాణాంతక జబ్బులకు
సకాలంలో సమీపంలో ఉచితంగా
ఆరోగ్య సేవలను అందించే
చికిత్స నిలయాలు బస్తీ దవాఖానాలు…
అందుబాటులో సిబ్బంది
అన్నివేళలా మౌలిక వసతులతో
మెరుగైన వైద్యసేవలను అందించి
దీర్ఘాయుషును పెంచే కేంద్రాలు
బస్తీ దవాఖానాలు…
మనసున కన్నీటి చెమ్మ రాకుండా
బతుకు బండికి ఏ అడ్డంకి కాకుండా
మహమ్మారి కరోనా వ్యాప్తి చెందకుండా
వెనువెంటనే పరీక్షలు చేసి
కంటికి రెప్పలా కాపాడి
నవ జీవనజ్యోతిని వెలిగించే
బస్తీ దవాఖానాలకు..
ప్రణామాలూ చేయాల్సిందే…
పగిడిపల్లి సురేందర్ పూసల
8074846063