Sri Lanka Crisis | ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో ప్రజలు కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. తిండి కోసం ప్రజలు ఆస్తులను అమ్ముకునే పరిస్థితులు నెలకొన్నాయి. అయినా ఆకలి బాధలు తీరే దారి కనిపించడం లేదు. రోమ్కు చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్‌లో లంక పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. నెలరోజులుగా కొనసాగుతున్న కరెన్సీ సంక్షోభం శ్రీలంక జనాభాలో భారీ ఎత్తున జనాన్ని పేదరికంలోకి నెట్టిందని నివేదిక సంస్థ నివేదిక పేర్కొంది.
ప్రపంచ ఆహార కార్యక్రమం (WEP) ప్రకారం.. శ్రీలంకలో 30 శాతం గృహాలు ఆహార భద్రత కరువైంది. మిగతా జనాభా పరిస్థితి సైతం చెప్పుకోదగ్గ పరిస్థితి లేవని నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన సమగ్ర సర్వే ఆధారంగా సంస్థ నివేదికను సిద్ధం చేసింది. ప్రపంచ ఆహార కార్యక్రమం (WEP) ప్రకారం.. పది కుటుంబాల్లో ఏడు కుటుంబాల కంటే ఎక్కువ ఆహారాన్ని ఆదా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. నచ్చిన ఆహారాన్ని తక్కువగా తీసుకుంటున్నారని, ఈ ఆందోళనకరమైన ధోరణి మొదట జూన్‌లో గుర్తించగా.. ఇంకా కొనసాగుతూనే ఉన్నది.
సంక్షోభం నేపథ్యంలో 80శాతం కుటుంబాలే ఏదో ఒక ఆస్తిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు సర్వేలో తేలింది. గత జూన్ నుంచి పరిస్థితి మరింత దిగజారుతూ వస్తున్నది. WEP చివరిసారిగా ఈ ఏడాది జూన్‌లో చివరిసారిగా సర్వే నిర్వహించింది. అయితే, ఈ ఆందోళనకర పరిస్థితులకు గత ప్రభుత్వ విధానాలే కారణమని ఆర్థిక నిపుణులు ఆరోపిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే హయాంలో శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ రెండేళ్లపాటు కరెన్సీని (Sri Lanka Rupee) ముద్రించిందని, ఫలితంగా ఈ ఏడాది అమెరికా డాలర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి విలువ క్షీణించిందని నిపుణులు పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో డాలర్‌తో పోలిస్తే.. మారకం విలువ 200 శ్రీలంక రూపాయలు ఉండగా.. ప్రస్తుతం అది 360కిపైగా చేరింది.
ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక ప్రపంచంలోని అత్యంత బాధ్యతారహితమైన పది బ్యాంకుల జాబితాలో చేరింది. లెబనాన్, జింబాబ్వే, టర్కీ, వెనిజులా, అర్జెంటీనా సెంట్రల్ బ్యాంక్‌లు సైతం ఇలాంటి బాధ్యతారహిత విధానాలను అవలంబించాయి. దీని ఫలితంగా కరెన్సీల విలువ వేగంగా దిగజారింది. ఫలితంగా ఆయా దేశాలు ద్రవ్యోల్బణం కారణంగా పేదరికాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ బ్యాంకు తన జాబితాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాన్‌ను సైతం చేర్చింది.
ప్రపంచ బ్యాంకు అత్యంత బాధ్యతారహితమైన సెంట్రల్ బ్యాంకుల జాబితాలో శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ 8వ స్థానంలో ఉంది. ఇటీవల శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ తన విధానాన్ని మార్చుకుంది. వడ్డీ రేట్లు పెంచి, కరెన్సీ ముద్రణను నిలిపివేసింది. దీంతో స్వల్పంగా ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినా.. సంక్షోభాన్ని మాత్రం నివారించలేకపోయింది. శ్రీలంకలో ప్రస్తుతం వ్యవసాయం సైతం సంక్షోభంలో ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజపక్సే ప్రభుత్వం రసాయన ఎరువుల దిగుమతిపై ఆకస్మిక నిషేధం విధించడంతో సంక్షోభం వైపు సాగుతోందని పేర్కొంటున్నారు. పశుపోషణ, కోళ్ల పెంపకం సైతం దెబ్బతింటోందని ఫలితంగా శ్రీలంక జనాభాలో అధిక భాగాన్ని పోషించే సమస్యను తీసుకువచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు.