హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): డిప్లొమా, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీఈసెట్ హాల్‌టికెట్లను ఈ నెల 9న విడుదల చేయనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 11గంటలకు హాల్‌టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈసెట్‌కు ఇప్పటివరకు 18,637 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు.
ఈ నెల 15న ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతీయ కేంద్రాల్లో 80 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను జరుగుతాయని వెల్లడించారు. రూ.5 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 9,10 తేదీల్లో, రూ.10 వేల ఆలస్య రుసుము తో ఈ నెల 11, 12 తేదీల్లో ఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.