హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : ఎప్సెట్ ఇంజినీరింగ్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ను ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన మంగళవారం విడుదల చేశారు.
బుధ, గురువారాల్లో వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఈ నెల 15న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు 16, 17 తేదీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.