గంజాయి బామ్మ.. నెట్వర్క్ పెద్దదే!
ఆ వృద్ధురాలి వయసు 75 ఏండ్లు.. ఆమె వద్ద దొరికిన గంజాయి 179.1 గ్రాము లు. మొదట ఈ కేసును చాలా లైట్‌గానే తీసుకున్న ఈగల్ ఫోర్స్‌కు.. ఆ బామ్మ నెట్వర్క్ ఛేదిస్తూ వెళ్లగా 70 మందికిపైగా వినియోగదారుల లిస్టు బయటికొచ్చింది. వారందరిని ఒకచోటికి తీసుకొచ్చి డ్రగ్స్ పరీక్షలు చేయగా 66 మందికి పాజిటివ్‌గా తేలింది. అందులో ము గ్గురు మైనర్లు ఉన్నారు. ఫతేనగర్‌లోని ఎల్బీఎస్ నగర్లో ఓ ఇంటి నుంచి గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో షేక్ జతేన్బీ(75)ని ఈగల్ ఫోర్స్ అరెస్టు చేసింది.
- మొదట కేసును లైట్గాతీసుకున్న ఈగల్ ఫోర్స్
- దర్యాప్తులో బయటపడ్డ 70 మంది కస్టమర్ల లిస్ట్
- 66 మందికి పాజిటివ్.. వీరిలో ముగ్గురు మైనర్లు
- పునరావాస కేంద్రాలకు 65 మంది తరలింపు
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఆ వృద్ధురాలి వయసు 75 ఏండ్లు.. ఆమె వద్ద దొరికిన గంజాయి 179.1 గ్రాము లు. మొదట ఈ కేసును చాలా లైట్‌గానే తీసుకున్న ఈగల్ ఫోర్స్‌కు.. ఆ బామ్మ నెట్వర్క్ ఛేదిస్తూ వెళ్లగా 70 మందికిపైగా వినియోగదారుల లిస్టు బయటికొచ్చింది. వారందరిని ఒకచోటికి తీసుకొచ్చి డ్రగ్స్ పరీక్షలు చేయగా 66 మందికి పాజిటివ్‌గా తేలింది. అందులో ము గ్గురు మైనర్లు ఉన్నారు. ఫతేనగర్‌లోని ఎల్బీఎస్ నగర్లో ఓ ఇంటి నుంచి గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో షేక్ జతేన్బీ(75)ని ఈగల్ ఫోర్స్ అరెస్టు చేసింది.
ఆమె నుంచి 41 చిన్న ప్యాకెట్లలో ఉన్న 179.1 గ్రాముల గంజాయితోపాటు రూ.43,340 నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నది. మొదట ఈ కేసును చిన్నదిగానే భావించినా.. ఆమె ఫోన్ పరిశీలించిన తర్వాత తన నెట్వర్క్ చాలా పెద్దదని ఈగల్ అధికారులు గుర్తించారు. వచ్చిన కాల్ లిస్టు, వారి ఫ్రెండ్స్ ఆధారంగా ఆ గంజాయి నెట్‌వర్క్‌ను ఛేదించగా.. మొత్తం 70 మంది అనుమానిత వినియోగదారులను గుర్తించారు. వారిలో 66 మందికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది.
గుర్తించిన వినియోగదారుల్లో 65 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరిలో 45 మందిని గాంధీ రిహాబిలిటేషన్ కేంద్రానికి, 15 మందిని ఆమనగల్ రిహాబిలిటేషన్ కేంద్రానికి, ఐదుగురిని కొత్తూరు రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. మైనర్ల విషయంలో చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవడంతోపాటు డీ-అడిక్షన్, పునరావాస సేవలు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. షేక్ జతేన్బీపై గతంలోనూ గంజాయి సంబంధిత ఏడు కేసులు ఉన్నట్టు పోలీసులు పేరొన్నారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న మున్నీ బేగం, ఇమ్రాన్, హనీఫా బీ, గిద్దీ అలియాస్ షేక్ ఖాజా బీ, షేక్ ఖాజా పాషా కోసం ఈగల్ ఫోర్స్ అధికారులు గాలిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

