మైక్రోసాఫ్ట్‌లో 60 వేల మందికి వీఆర్ఎస్!
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సుమారు 60 వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ఆఫర్‌ను ప్రకటించింది. భారత్, అమెరికా, కెనడా, బ్రిటన్‌లో అర్హులైన ఉద్యోగులకు ఈ పథకం ప్రకటించింది.
- భారత్ సహా నాలుగు దేశాల్లోని ఉద్యోగులకు అవకాశం
- ఏఐపై భారీ పెట్టుబడుల నేపథ్యంలో ఖర్చుల తగ్గింపుపై కంపెనీ దృష్టి
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సుమారు 60 వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ఆఫర్‌ను ప్రకటించింది. భారత్, అమెరికా, కెనడా, బ్రిటన్‌లో అర్హులైన ఉద్యోగులకు ఈ పథకం ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ మొత్తం ఉద్యోగులు సుమారు 2.23 లక్షలు కాగా, వారిలో దాదాపు 27 శాతం మందికి ఈ ఆఫర్ కల్పించింది. అయితే, అర్హులైన వారందరూ ఉద్యోగాలను వీడతారని కంపెనీ ప్రకటించలేదు.
ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం. ఈ పథకాన్ని ఎంచుకునే ఉద్యోగులకు వారి ఉద్యోగ స్థాయి, సంస్థలో పనిచేసిన కాలాన్ని బట్టి పరిహారం అందించనున్నారు. కృత్రిమ మేధ, డాటా సెంటర్ల విస్తరణపై మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెడుతున్నది. ఈ నేపథ్యంలో ఖర్చులను నియంత్రిస్తూ, మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను సర్దుబాటు చేసుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ పథకం తీసుకొచ్చినట్టు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది ఉద్యోగులు సంస్థను వీడతారనే విషయాన్ని మైక్రోసాఫ్ట్ వెల్లడించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

