ఒకే లాగిన్‌లో జేఈఈ రిజిస్ట్రేషన్
జేఈఈ మెయిన్-27 దరఖాస్తు విధానంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్వల్ప మార్పులు చేసింది. దరఖాస్తు ప్రకియను సులభతరం చేసేందుకు కొత్తగా ఎన్టీఏ మేరీ పెహచాన్ నేషనల్ సింగిల్ లాగిన్ విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. దీంతో అభ్యర్థులు ఒకే లాగిన్‌తో జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లోకి ప్రవేశించవచ్చు.
- రాష్ట్రంలో 13 పట్టణాల్లో ఎగ్జామ్స్ సెంటర్లు : ఎన్టీఏ
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్-27 దరఖాస్తు విధానంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్వల్ప మార్పులు చేసింది. దరఖాస్తు ప్రకియను సులభతరం చేసేందుకు కొత్తగా ఎన్టీఏ మేరీ పెహచాన్ నేషనల్ సింగిల్ లాగిన్ విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. దీంతో అభ్యర్థులు ఒకే లాగిన్‌తో జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లోకి ప్రవేశించవచ్చు. పలు ఖాతాలకు సంబంధించిన యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. డిజిలాకర్, ఈ ప్రమాణ్, జన్ పరిచయ్ వంటి సేవలను అనుసంధానించారు. అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది.
ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఆపార్, ఈ కేవైసీ ధ్రువీకరణ ఆటోమెటిక్ అవుతుంది. దీంతో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, పాస్వర్డ్ అవసరాలుండవు. ఇదిలా ఉండగా, జేఈఈ మెయిన్ పరీక్షలను ఈసారి దేశవ్యాప్తంగా 301 పట్టణాల్లో నిర్వహించనున్నటు ఎన్టీఏ వెల్లడించింది. వీటిలో రాష్ట్రంలో 13 పట్టణాలున్నాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్‌లో పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

