e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News ఉప్పల్‌ ప్లాటు.. యమ హాటు

ఉప్పల్‌ ప్లాటు.. యమ హాటు

  • ఉప్పల్‌ భగాయత్‌లో లక్ష దాటిన గజం..
  • మొదటి రోజు 23 ప్లాట్లకు ఆన్‌లైన్‌ వేలం.. ఆదాయం రూ.141.61 కోట్లు
  • గజానికి గరిష్టంగా రూ.1,01,000.. కనిష్టంగా రూ.53,000లు

సిటీబ్యూరో, డిసెంబర్‌ 2(నమస్తే తెలంగాణ): ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌లో విక్రయానికి ఉం చిన ప్లాట్లకు కొనుగోలుదారులకు నుంచి విశేష స్పందన వచ్చింది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ), కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ ఎంఎస్‌టీసీతో కలిసి నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలంలో మొదటి రోజు 23 ప్లాట్లకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రెండు సెషన్లలో ఇ-ఆక్షన్‌ నిర్వహించారు. గజం ధర అత్యధికంగా రూ.1,01,000లు పలికింది. కనిష్టంగా ఒక ప్లాటుకు మాత్రం రూ.53,000లు పలికింది. ఆ తర్వాత చాలా ప్లాట్లకు గజం ధర రూ.66 వేల పైన కొనుగోలుదారులు కోట్‌ చేశా రు. ఆన్‌లైన్‌ వేదికగా జరిగిన వేలంలో ఎంతో పోటీ పడ్టారు. హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన ఉప్ప ల్‌ భగాయత్‌ లే అవుట్‌లో మొత్తం 44 ప్లాట్లు (సుమారు 1,35,408 గజాల స్థలం) విక్రయానికి ఉంచారు. ఇందులో 23 ప్లాట్లలో 19,719 గజాల స్థలాన్ని మొదటి రోజు విక్రయానికి ఉంచ గా, అన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. గజానికి అప్‌సెట్‌ ధర ను రూ.35,000లు నిర్ణయించగా, ఆ తర్వాత రూ.1000ల చొప్పున పెంచాలనే నిబంధనను అమలు చేశారు. ఆన్‌లైన్‌ వేలం పర్యవేక్షణను అమీర్‌పేట హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. గతంలో ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌లో అమ్మకానికి ఉంచిన ప్లాట్ల కు ఆదరణ లేక మిగిలిపోయిన ప్లాట్లకు ఈసారి వేలం వేయగా, ఆ ప్లాట్లకు మంచి రేటు పలికింద ని అధికారులు తెలిపారు. ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌లోని ప్లాట్లకు పలికిన ధరలు ఐటీ కారిడార్‌ పరిధిలో ఉన్న ప్లాట్ల రేట్లు పలికాయని, ఈ లేఅవుట్‌కు ఉన్న ప్రత్యేకతలే మంచి ధరలు పలికాయని తెలిపారు. కాగా, శుక్రవారం మిగిలిన 21 ప్లాట్లకు రెండు సెషన్లలో వేలం చేపట్టనున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement