Fire Accident | దుర్గా పూజా మండపంలో అగ్నిప్రమాదం : షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు
అగర్తలాలోని బ్లడ్ సన్ క్లబ్లో ఏర్పాటు చేసిన దుర్గా పూజా మండపంలో (Fire Accident) మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పూజా మండపంతో పాటు దేవతా విగ్రహం పూర్తిగా దగ్ధమయ్యాయి.
త్రిపుర : అగర్తలాలోని బ్లడ్ సన్ క్లబ్లో ఏర్పాటు చేసిన దుర్గా పూజా మండపంలో (Fire Accident) మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పూజా మండపంతో పాటు దేవతా విగ్రహం పూర్తిగా దగ్ధమయ్యాయి. మండపంలో పనులు జరుగుతుండగా షార్ట్సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పూజా మండపంలో అగ్నిప్రమాదం జరగడం పట్ల త్రిపుర సీఎం మాణిక్ సాహ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నదన్నారు.
క్లబ్ సభ్యులందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని కోరారు. అగ్నిప్రమాదంతో దగ్ధమైన దుర్గా పూజా మండపాన్ని సీఎం సందర్శించారు. పూజా మండపాలను నిర్మించే వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.
Read More :
War 2 | హృతిక్ రోషన్, తారక్ వార్ 2 షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా..?
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Agartala
- Durga Pandal
- fire
- navratri
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

