Dulquer Salmaan | కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తోంది. ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ కరోనా బారినపడ్డారు. దుల్కర్ సల్మాన్.. మలయాళ, తమిళ భాషల్లో అనేక సినిమాల్లో నటించారు.
మమ్ముట్టి కూడా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. అయితే దుల్కర్ సల్మాన్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు దుల్కర్ సల్మాన్ తెలిపారు.
ఇటీవల జరిగిన షూటింగ్‌ల్లో తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ హోంఐసోలేషన్ లో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సల్మాన్ విజ్ఞప్తి చేశారు.