డ్రై ఫ్రూట్స్ రారాజు వాల్నట్స్.. నేడు వాల్నట్స్ జాతీయ దినం
డ్రై ఫ్రూట్స్ అనగానే మనకు గుర్తొచ్చేవి బాదాం, కాజు, పిస్తా మాత్రమే. వీటికి ఏమాత్రం పోషకాలు తక్కువ కాకుండా ఉండే మరో డ్రైఫ్రూట్.. వాల్నట్. నేషనల్ వాల్నట్ డే సందర్భంగా వీటి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.

డ్రై ఫ్రూట్స్ అనగానే మనకు గుర్తొచ్చేవి బాదాం, కాజు, పిస్తా మాత్రమే. వీటికి ఏమాత్రం పోషకాలు తక్కువ కాకుండా ఉండే మరో డ్రైఫ్రూట్.. వాల్నట్. నేషనల్ వాల్నట్ డే సందర్భంగా వీటి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.
వాల్నట్స్.. వీటినే మనం ఆక్రూట్స్ అని కూడా పిలుస్తాం. ఇవి చూసేందుకు మెదడు ఆకారంలో ఉంటాయి. వాల్‌నట్స్‌లో మన శరీరానికి కావల్సిన ఎన్నో విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. వీటిలో ఒమేగా-3 ఆరోగ్యకర కొవ్వులు, మాలిబ్డినం, రాగి, బయోటిన్, మాంగనీస్, భాస్వరం, సెలీనియం, ఇనుము, కాల్సియం వంటి పోషకాలు లభిస్తాయి. వీటిలో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉండి శరీర నిరోధక వ్యవస్థను ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచి మనల్ని వ్యాధులకు దూరంగా ఉండేలా చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలకు సంబంధించిన సమస్యలను తగ్గించటంలో సహకరిస్తాయి. వంటకాల్లో వీటిని చేర్చడం వలన హృదయ నాళ వ్యవస్థను ఆరోగ్యకర స్థాయిలో ఉంచుతుందని పలు పరిశోధనల్లో వెల్లడయింది. కొన్ని కొత్త అధ్యయనాల ప్రకారం, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించే సామర్థ్యాన్ని వాల్నట్స్ కలిగి ఉన్నాయని తేలింది.
ఉదయాన్నే తినడం మంచిది..

ముఖ్యంగా ఈ నట్స్ ను నీటిలో నానబెట్టి, రెండింటిని తర్వాత రోజు ఉదయం తీసుకోవడం మరింత ఆరోగ్యం. మరి ప్రతిరోజూ కనీసం 5 వాల్ నట్స్ అన్నా తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. శరీరం బరువును తగ్గించడంలో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వీటిలో మెలటోనిన్ అనే కాంపౌండ్ ఉండి మనకు మంచి నిద్రను అందిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గొప్పగా పనిచేస్తుంది. అమైనో ఆమ్లం అయిన ఎల్-ఆర్గినైన్ ఉనికిని కలిగి ఉండటం ద్వారా గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు లేదా కార్డియాక్ అరెస్ట్ తో ప్రమాదంలో ఉన్న వారికి ప్రాణాలు నిలబెట్టడంలో గొప్ప ప్రయోజనాలు అందిస్తుంది.
హెల్తీ స్పెర్మ్ తయారుకు..

అక్రోటు కాయలు నిత్యం తీసుకోవడం వలన రక్త పీడనం అదుపులో ఉంటుంది. వీటిలో ఉండే ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ శరీరంలోని చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యకరంగా ఉంచే మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది. అయితే హెర్ప్పెస్ సమస్యతో బాధపడుతున్న వారు వీటిని తీసుకోవడం తగ్గించాలి. ఊబకాయాన్ని నివారించడంలో, మెదడు ఆరోగ్యానికి , పురుషుల్లో లైంగిక ప్రత్యుప్పత్తి వ్యవస్థ మెరుగుకు, టైప్2 మధుమేహంతో బాధపడేవారిలో జీవక్రియలు సక్రమంగా కొనసాగడంలో ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా నిత్యం గుప్పెడు వాల్నట్స్ తినడం అలవర్చుకోవాలి. వీటిని నిత్యం తీసుకోవడం ద్వారా ఎముకలు, దంతాలను బలంగా ఉంచుకోవచ్చు. ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చని సెలవిస్తున్నారు వైద్యనిపుణులు.
ఇవి కూడా చదవండి..
నితీష్జీ.. నా కోసం పెండ్లిళ్లపై నిషేధం విధించరూ..?!
కరోనా ముప్పు దృష్ట్యా పాఠశాలల మూసివేతకు నిర్ణయం
ప్రయాణ పరిమితులను తొలగించిన సౌదీ అరేబియా
వచ్చే ఏడాదికల్లా మార్కెట్లోకి హీరో ఎలక్ట్రిక్ బైక్
పూరీ జగన్నాథుడి చందన్యాత్ర ప్రారంభం
అధిక రక్తపోటు.. చేయాల్సినవి.. చేయకూడనివి
శ్రీలంక క్రికెట్లో వివాదం: ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత
భద్రంగా అజ్మీర్‌లోని ఇజ్రాయెల్ మందిరం
24 మందితో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. చరిత్రలో ఈ రోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Akroots
- Daily 5
- Health news
- Pintop
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

