ఫొటో ఫ్రేమ్స్‌లో డ్రగ్స్ రవాణా

- హైదరాబాద్ నుంచి అస్ట్రేలియాకు కొరియర్లో స్మగ్లింగ్
- రూ. 5.5 కోట్ల విలువైన 14.2 కిలోల ఎఫిడ్రిన్ స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ)/సత్తుపల్లి: హైదరాబాద్ నుంచి అస్ట్రేలియాకు కొంతకాలంగా గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారాన్ని హైదరాబాద్ బేగంపేట పోలీసులు, డీఆర్ఐతో కలిసి బట్టబయలు చేశారు. ఫొటో ఫ్రేమ్స్‌లో మాదకద్రవ్యాలను పెట్టి కొందరు స్మగ్లింగ్ చేస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందటంతో బేగంపేటలోని ఇంటర్నేషనల్ కొరియర్ ఏజెన్సీపై దాడి చేసి రూ.5.5 కోట్ల విలువైన 14.2 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.
గురువారం కమిషనరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ వివరాలను ఆయన వెల్లడించారు. మార్కెట్లో ఈ డ్రగ్ కిలో రూ.40 లక్షలు ఉంటుందని చెప్పారు. ఈ దందా వెనుక తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తుల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు పేర్కొన్నారు.
సత్తుపల్లిలో 566 కిలోల గంజాయి స్వాధీనం
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు రవాణా చేస్తున్న రూ.1.43 కోట్ల విలువైన 566 కిలోల గంజాయిని సత్తుపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ గురువారం తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

