Driveing Licence | నైపుణ్యం కలిగిన వాహన దారులకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాలి : జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్
Driveing Licence | అధికారులు నైపుణ్యం కలిగిన వాహన దారులకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాలని విజిఎన్ఫోర్స్మెంట్ లెన్స్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ఆదేశించారు. శ
ఇబ్రహీంపట్నం : అధికారులు నైపుణ్యం కలిగిన వాహన దారులకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్( Driveing Licence ) జారీ చేయాలని విజిఎన్ఫోర్స్మెంట్ లెన్స్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ( Joint Transport Commissioner ) చంద్రశేఖర్ గౌడ్ ఆదేశించారు. శనివారం ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష నిర్వహణ తీరు, ప్రజలకు అందుతున్న సేవలు, వాహన్ పోర్టల్లో పెండింగ్ దరఖాస్తుల స్థితిని అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుత ప్రమాణాలు రహదారి భద్రతకు తగినంతగా ఉన్నాయా అని అంచనా వేసి, డ్రైవింగ్ పరీక్ష మరింత కఠినంగా, సమగ్రంగా నిర్వహించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అనేది కేవలం ఒక పత్రం మాత్రమే కాదని, అది రహదారిపై వాహనం నడపడానికి ఇచ్చే అనుమతి అని అన్నారు. నిర్లక్ష్యంగా నిర్వహించే పరీక్షలు నేరుగా రోడ్డు ప్రమాదాలకు దారితీస్తాయని తెలిపారు. దరఖాస్తుదారులతో , సాధారణ ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడారు.
ప్రజలకు అందుతున్న సర్వీసెస్, వేచి ఉండే సమయం, సిబ్బంది వ్యవహారం మరియు ఆన్లైన్ పోర్టల్ వినియోగంపై అభిప్రాయాలు సేకరించారు. ప్రతి దరఖాస్తుదారుని మర్యాదగా చూడాలని, నిర్దేశిత గడువులోపు దరఖాస్తులు పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.వాహన దారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. బ్యాక్లాగ్లను ప్రాధాన్యతగా క్లియర్ చేయాలని,వాహన్ దరఖాస్తుల పరిష్కారంలో అనవసర జాప్యం తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. కార్యాలయ ప్రాంగణంలో ఏ ఏజెంట్లు, మధ్యవర్తులు , అనధికార వ్యక్తులనూ అనుమతించరాదని తెలిపారు. పౌరులు నేరుగా కౌంటర్ల వద్దకు వచ్చి లేదా VAHAN/SARATHI ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా సేవలు పొందవచ్చని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

