అచ్చంపేటరూరల్: అచ్చంపేట డిపో ఆవరణలో శ్రీ భగవాన్ సత్యసాయి సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిపో మేనేజర్ ( RTC DM) మురళి దుర్గ ప్రసాద్ ( Murali Durga Prasad ) శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతు వేసవిలో ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ ( Bus stand ) ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికుల సేవను దృష్టిలో ఉంచుకొని సమితి తీసుకున్న ఈ కార్యచరణ అభినందనీయన్నారు. ఈ కార్యక్రమంలో డిపో అధికారులు, ఉద్యోగులు, ప్రయాణికులు పాల్గొన్నారు.