2డీజీ ఔషధం సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేయనున్న డీఆర్డీఓ
2డీజీ ఔషధం సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేయనున్న డీఆర్డీఓ | కరోనాకు వ్యతిరేకంగా అభివృద్ధి చేసిన 2డీజీ (డియోక్సీ-డి-గ్లూకోజ్) ఔషధానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పలు ఫార్మా కంపెనీలకు బదిలీ చేసేందుకు డీఆర్డీఓ (భారత రక్షణ పరిశోధన సంస్థ) నిర్ణయించింది.

హైదరాబాద్ : కరోనాకు వ్యతిరేకంగా అభివృద్ధి చేసిన 2డీజీ (డియోక్సీ-డి-గ్లూకోజ్) ఔషధానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పలు ఫార్మా కంపెనీలకు బదిలీ చేసేందుకు డీఆర్డీఓ (భారత రక్షణ పరిశోధన సంస్థ) నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఈ మేరకు ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులు (ఈఓఐ) ఆహ్వానించింది. 2-డీజీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్డీఓ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) అభివృద్ధి చేసింది. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో తేలిసిన విషయం తెలిసిందే.
కొవిడ్ బాధితులకు వినియోగించేందుకు డీసీజీఐ అత్యవసర అనుమతి సైతం జారీ చేసింది. ఔషధంపై డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఇప్పటికే డీఆర్డీఓతో కలిసి పనిచేస్తోంది. ప్రయోగాత్మక ఉత్పత్తి దశ పూర్తిచేసి, వాణిజ్య ప్రాతిపదికన 2-డీజీ మందును దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి డాక్టర్ రెడ్డీస్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి దరఖాస్తులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీ వరకు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తులను (ఈఓఐ) పంపాలని సూచించింది. టెక్నికల్ అసెస్మెంట్ కమిటీ (టీఏసీ) పరిశీలించి, 15 దేశీయ కంపెనీలకు.. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ విధానంలో సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేయనున్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం
ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ టీకాల ధరలను నిర్ణయించిన కేంద్రం
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో కొత్తగా 92,596 కరోనా కేసులు
రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధమే.. : కేంద్రమంత్రి
దేశంలో 23.88 కోట్ల కొవిడ్ టీకాల పంపిణీ
రేపు ఆకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

