తాండూర్ : మండల కేంద్రంలోని విద్యాభారతి పాఠశాలలో (Vidya Bharati School) సోమవారం భారత పెట్రోలియం సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలను (Drawing competitions) నిర్వహించారు. భారత పెట్రోలియం సేల్స్ ఆఫీసర్ నాగరాజు మాట్లాడుతూ స్వచ్ఛత పక్వాడా పక్షోత్సవాల్లో భాగంగా విద్యార్ధులకు శుభ్రత, పరిశుభ్రతతో పాటు పలు అంశాల్లో పిల్లలకు పోటీలు నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణ కోసం భావితరాలకు ఉపయోగపడే విధంగా మొక్కల పెంపకం వాటిని సంరక్షించే విధానం తదితర అంశాల గురించి చిన్నారులకు వివరించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ ప్రశాంత్ , పాఠశాల కరస్పాండెంట్ సురభి శరత్ కుమార్, ప్రిన్సిపాల్ సరోజరాణి, విద్యార్థులు పాల్గొన్నారు.