Ram Charan and Upasana | మెగా ఇంట ‘డబుల్’ ధమాకా మొదలైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు శనివారం రాత్రి కవల పిల్లలకు జన్మనిచ్చారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఒక బాబుకి, ఒక పాపకి జన్మనిచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ.. అత్యంత సంతోషంతో, కృతజ్ఞతా భావంతో ఈ విషయాన్ని పంచుకుంటున్నానని, తల్లీ బిడ్డలు ముగ్గురూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. మా ఇంట్లోకి ఈ బుజ్జి ప్రాణులు రావడం దైవ ప్రసాదంలా అనిపిస్తోందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
అయితే ఈ వార్త తెలిసిన వెంటనే మెగా అభిమానులు భారీ ఎత్తున అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుని బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో “జై చరణ్.. జై మెగాస్టార్” అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. 2023లో జన్మించిన క్లిన్ కారా తర్వాత, ఇప్పుడు ఈ కవలల రాకతో మెగా కుటుంబం మరింత పెద్దదైంది. ముఖ్యంగా మెగా వారసుడి రాక కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ‘Mega Twins’ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
#RamCharan & #Upasana Welcome twins
Fan celebration at apollo pic.twitter.com/8N6W4d021t
— IndiaGlitz Telugu™ (@igtelugu) January 31, 2026