హుజూరాబాద్ రూరల్, నవంబర్ 2: ఆర్టీసీలో క్రమంగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తూ సంస్థను ప్రైవేటుపరం చేయొద్దని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జేఏసీ కోకన్వీనర్ థామస్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ఆర్టీసీ బస్టాండ్‌లో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలో కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతున్నదని ఆరోపించారు. ఎంతోమంది కార్మికులు అధికారుల ఒత్తిడి వల్ల మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిపారు.
పలువురు డ్రైవర్లు, కండక్టర్లు మృతిచెందిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నా రు. మహాలక్ష్మి పథకంతో ఒత్తిడి పెరిగిందని, మహిళల టికెట్ల డబ్బులు ప్రభు త్వం ఇవ్వకపోవడంతో సంస్థ తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్టీసీ అధికారులు జీరో టికెట్ కాకుండా డబ్బులు ఎన్ని తెచ్చావు? ఎందుకు తేవడం లేదు? అంటూ కండక్టర్లను ఒత్తిడి చేయడంతో వారు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు.