Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Donald Trump : ఉక్రెయిన్‌కు జెలెన్స్కీ కాకుండా కొత్త అధ్యక్షుడు కావాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. రష్యా-అమెరికా మధ్య కుదిరిన డీజిల్ ఒప్పందంపై జెలెన్స్కీ స్పందించారు.
Donald Trump : రష్యా నుంచి డీజిల్ కొనేందుకు అమెరికా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా ప్రకటన చేశారు. ఈ విషయంలో సహకరించినందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. అయితే, ఈ ఒప్పందంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రష్యాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధానికి పెట్టుబడిగా జెలెన్స్కీ అభివర్ణించారు.
అయితే, రష్యాతో తాము ఒప్పందం కుదుర్చుకోవడాన్ని జెలెన్స్కీ వ్యతిరేకించడంపై ట్రంప్ కూడా మండిపడ్డారు. ఉక్రెయిన్‌కు జెలెన్స్కీ కాకుండా కొత్త అధ్యక్షుడు కావాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. రష్యా-అమెరికా మధ్య కుదిరిన డీజిల్ ఒప్పందంపై జెలెన్స్కీ స్పందించారు. తమ దేశంపై రష్యా మరిన్ని దాడులు చేసేందుకు అవకాశం కల్పించేలా ట్రంప్ ఒప్పందం ఉందన్నారు. రష్యా డీజిల్‌పై అమెరికా ఆంక్షలు ఎత్తివేసినందుకు కృతజ్ఞతగా తమ దేశంలోని జపోరిజియాలోని నివాస స్తలాలపై శనివారం రష్యా దాడులు చేసిందన్నారు.
తమ రాజధాని కీవ్ నగరంపై కూడా రష్యా దాడికి పాల్పడిందని జెలెన్స్కీ అన్నారు. అయితే, డీజిల్ కొనుగోలులో తమ నిర్ణయాన్ని జెలెన్స్కీ వ్యతిరేకించడంపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఉక్రెయిన్ ప్రజలకు కొత్త అధ్యక్షుడు అవసరం. ఆ అధ్యక్షుడు రష్యాతో ఒప్పందం కుదుర్చుకోగలడు. జెలెన్స్కీ అనేక ఒప్పందాలు కుదుర్చుకోవాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల వాటికి అంగీకరించలేదు. జెలెన్స్కీ ప్రపంచానికి సమస్యలు సృష్టించాలనుకుంటున్నాడు.
చమురు కొరత వల్ల మా దేశ రైతులకు, పాడి రైతులకు సమస్యలు సృష్టించాలనుకుంటున్నాడు. ఉక్రెయిన్‌కు చెందిన 30 శాతం భూభాగాన్ని ఆ దేశం కోల్పో్యింది. ఆ ప్రాంతంలో పది లక్షల మందికిపైగా చెల్లాచెదురయ్యారు. అలాగే, రెండు మిలియన్లకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అసలు, ఈ యుద్ధమే ప్రారంభం కాకుండా ఉండాల్సింది. అందుకే, ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరం. ఇందుకోసం ఇదే సరైన సమయం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

