వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా త్వరలో రెండోసారి బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తన పాలకవర్గంలో కుటుంబ సభ్యులకు, బంధు వర్గానికి చోటు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఇద్దరు వియ్యంకులకు పదవులు దక్కగా తాజాగా ట్రంప్ కాబోయే కోడలికి కూడా పదవి దక్కింది. తన కుమారుడు జూనియర్ ట్రంప్‌కు కాబోయే భార్య, మాజీ ఫాక్స్ న్యూస్ ప్రెజెంటర్ కింబర్లీ గిల్ఫోయిల్ను గ్రీస్ రాయబారిగా నియమిస్తున్నట్లు ట్రంప్ మంగళవారం ప్రకటించారు.