న్యూఢిల్లీ: దేశవాళీ బ్యాడ్మింటన్ సీజన్‌కు వేళయైంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత 20 నెలలుగా స్తంభించిపోయిన జాతీయ స్థాయి టోర్నీలు డిసెంబర్లో మొదలుకానున్నాయి. చెన్నైలో డిసెంబర్ 16న సీనియర్ ర్యాంకింగ్ లెవల్-3 టోర్నీతో దేశవాళీ పోటీలకు తెరలేవనుంది. చెన్నై తర్వాత హైదరాబాద్‌లో డిసెంబర్ 24 నుంచి 30 వరకు టోర్నీ జరుగుతుందని జాతీయ బ్యాడ్మింటన్ ఫెడరేషన్(బాయ్) బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.