HomeBusinessDollar Industries Founder Dindayal Gupta Dies At 88
‘డాలర్’ ఫౌండర్ దీన్‌దయాల్ గుప్తా మృతి
దుస్తుల సంస్థ డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫౌండర్, చైర్మన్ దీన్‌దయాల్ గుప్తా మరణించారు. ఆయన వయస్సు 88. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు.
కోల్‌కతా, మే 2: దుస్తుల సంస్థ డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫౌండర్, చైర్మన్ దీన్‌దయాల్ గుప్తా మరణించారు. ఆయన వయస్సు 88. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. 1937లో హర్యానాలో జన్మించిన ఆయన..1972లో కోల్‌కతా వేదికగా డాలర్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించారు. సామాన్యులకు సైతం బ్రాండెడ్ దుస్తులు అందించాలనే ఉద్దేశంతో ఆయన దుస్తుల ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సంస్థ రూ.1,700 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.