అమరావతి : ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో అమానుష ఘటన చోటు చేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ మనిషి కాలును కుక్క( Dog ) నోట కరుచుకుని తిన్న ఘటన గుంటూరులోని జీజీహెచ్ ( GGH ) లో జరిగింది.
ఓ రోగికి వైద్యులు శస్త్రచికిత్స చేసి కాలును తొలగించారు. ఆసుపత్రి నిబంధనల ప్రకారం తొలగించిన అవయవాలను ప్రత్యేకమైన యంత్రాలలో అత్యధిక ఉష్ణోగ్రత వద్ద దహనం చేయాల్సి ఉండగా సమీపంలోని డస్ట్బీన్లో పడేశారు.
దీంతో అక్కడే సంచరిస్తున్న కుక్క కాలును నోట కరచుకుని తిరిగిన ఘటన వీడియోలో వైరల్ కావడంతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని డీఎంఈకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుక్కల సంచారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.