Health Tips : కోడిగుడ్డు పచ్చసొన (Egg Yolk) తినాలంటే చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే దాంట్లో కొవ్వుల శాతం ఎక్కువగా ఉంటుందని, అది తినడంవల్ల రక్తనాళాల్లో కొవ్వు పెరుగుతుందని ఆందోళన చెందుతారు. కొవ్వు పెరిగితే రక్తనాళాలు మూసుకుపోయి గుండె జబ్బులు వస్తాయని జంకుతుంటారు. ఒంట్లో కొవ్వు పెరిగి స్థూలకాయం వంటి ఇతర అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉందని ఎక్కువ మంది కోడిగుడ్డు పచ్చసొనను పక్కన పెడుతుంటారు. కానీ అది ఒట్టి అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి కోడిగుడ్డు పచ్చసొనతో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.