బన్సీలాల్‌పేట్, జూన్ 5 : ప్రభుత్వం జీ.ఓ.38 ప్రకారం బదిలీలను పారదర్శకంగా చేయడం లేదని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆరోపించింది. ఈ మేరకు శుక్రవారం గాంధీ ఆస్పత్రి యూనిట్ ఆధ్వర్యంలో వైద్యులు విధులను బహిష్కరించి.. ప్రధాన భవనం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
భార్యాభర్తలకు ఒకే ప్రాంతంలో పనిచేసే అవకాశం కల్పించాలని, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లను వెంటనే మంజూరు చేయాలని, వైద్యుల సంఘం నాయకులను బదిలీల నుంచి మినహాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.