అష్టచెమ్మా చిత్రంతో హీరోగా పరిచయమైన నాని ఆ తరువాత పిల్లజమీందార్, కృష్ణగాడి వీర ప్రేమకథ, అలా మొదలైంది, ఈగ, ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, ఎంసీఎ, నిన్నుకోరి, జెర్సీ, శ్యామ్ సింగరాయ్, దసరా, సరిపోదా శనివారం వంటి విజయంతమైన చిత్రాల్లో హీరోగా నటించాడు. అయితే అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోగా మారిన నాని ఎప్పుడూ వరుస సినిమాలు చేస్తుంటాడు.
పక్కింటి కుర్రాడి పాత్రలో నటిస్తూ అయితే నేచురల్‌స్టార్‌గా నటిస్తున్న నానికి ఈ మధ్య మాస్‌హీరోగా ఎదగాలనే కోరికతో మాస్ సినిమాలు ఒప్పుకుంటున్నాడు. నాని నటించిన వీ, శ్యామ్ సింగరాయ్, దసరా, సరిపోదా శనివారం ఈ కోవలోకి వస్తాయి. అయితే నానిని మాస్ సినిమాలు సరైన ఫలితాలు ఇవ్వకకోయినా ఆయన మాత్రం ఆ బాట విడవటం లేదు. ఈ జాబితాలోనే బలగం దర్శకుడు వేణు ఎల్ఢండ చెప్పిన ఓ మంచి కథను నాని ఒప్పుకోలేదని సమాచారం.
సెన్సిటివ్, ఫ్యామిలీ ఎంటర్టైనరకు ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌ను జోడించి వేణు చెప్పిన కథలు మాస్ అంశాలు లేవని నాని ఆ సినిమా చేయడం లేదట. అయితే ఇదే సమయంలో దసరా దర్శకుడు చెప్పిన మరో మాస్ కథకు ఈ కథానాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో పాటు శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్-3లో అర్జున్ సర్కార్ మరో మాస్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో కూడా నాని నటిస్తున్నాడు.
అయితే మాస్ ఇమేజ్‌లో పడిపోయి.. బలగం వేణు చెప్పిన ఓ మంచి కథను నాని మిస్ చేసుకోవడం కరెక్ట్ కాదని ఆ కథ గురించి తెలిసిన కొంత మంది నాని సన్నిహితులు అంటున్నారు కొంత మంది సినీ ప్రముఖులు. ఇప్పడు వేణు ఇదే కథతో మరో క్రేజీ హీరోను అప్రోచ్ అయ్యాడని సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. ఈ సినిమాకు వేణు ‘ఎల్లమ్మ’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసకున్నాడు.