తెలుగు సినీ పరిశ్రమకు నార్త్ నుండి వచ్చిన కథానాయికల్లో తాప్సీ ఒకరు. ఝమ్మందినాథంతో తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాలభామ తొలిచిత్రంతోనే కుర్రకారును అలరించింది. ఆ తరువాత అనతికాలంలోనే టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారింది. అయితే ప్రస్తుతం తెలుగు సినిమాలను తగ్గించిన తాప్పీ ఇప్పుడు బాలీవుడ్లో బిజీ కథానాయికగా గా మారింది. అయితే తెలుగులో సినిమాలు తగ్గించిన ఈమె ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోలందరితోనూ జతకట్టింది.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ప్రభాస్‌తో మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలో నటించాను. ఆయన అందగాడు. నా ఎత్తుకు నేను ఆయనకు జోడిగా బాగా సరిపోయాను అని అందరూ అన్నారు. ప్రభాస్ చాలా జోవియల్‌గా వుండేవాడు. కలివిడి తత్వం ఎక్కువ. అయితే నేను మొదట్లో మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలో నటించడానికి సంకోంచించాను. ఎందుకంటే ఆ తరువాత అన్ని రెండో హీరోయిన్ పాత్రలే వస్తాయని అనుకున్నాను. కానీ కథ నచ్చి ఆ సినిమాలో నటించాను. ఆ సినిమా సాధించిన విజయంతో నాకు మంచి పేరు వచ్చింది’ అని తెలిపారు.
రవితేజ గురించి ఆమె మాట్లాడుతూ రవితేజ అంటే అసలు సిసలు ఎనర్జీ ఎలా వుంటుందో చూడొచ్చు. ఆయనతో షూటింగ్ అంటే మనకు కూడా హుషారు వస్తుంది. అందుకే మాస్ ప్రేక్షకులను రవితేజని బాగా ఇష్టపడతారు. నేను రవితేజతో కలిసి వీర చిత్రంలో నటించాను. ఆ సినిమా సెట్లో మార్నింగ్ నుంచి ఈవెనింగ్ వరకు అదే హుపారు. ఆయన్ని చూస్తుంటే మనకు ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు తాప్సీ. ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా వున్న తాప్సీ పన్ను త్వరలోనే తెలుగులో రూపొందనున్న ఆనందో బ్రహ్మా సీక్వెల్‌తో పాటు మరో క్రేజీ హీరో చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లుగా తెలిసింది.