Health tips : సాధారణంగా క్యారెట్లు ఎరుపు, కాషాయం రంగులో ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఒక రకం క్యారెట్లు మాత్రం నల్లగా ఉంటాయి. ఈ నల్ల క్యారెట్లను చాలామంది చూసి ఉండరు. ఇవి చాలా తక్కువగా కనిపిస్తాయి. వీటినే కాలా గాజర్లు అంటారు. ఈ కాలా గాజర్లు కొన్ని బాగా నల్లగా, కొన్ని మాత్రం బీట్రూట్ రంగులో కనిపిస్తాయి. అయితే సాధారణ క్యారెట్లతో పోల్చితే ఈ నల్ల క్యారెట్లతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. రుచికి మాత్రం ఇవి అంతతీయగా ఉండవు. మరి ఈ నల్ల క్యారెట్లతో కలిగే ఆ ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం..