‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా, ప్రపంచవ్యాప్తంగా పాపులారిటిని సంపాందించుకున్నారు హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నాడు ఈ ఐకాన్‌స్టార్. సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. డిసెంబరు 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా వుండగా సాధారణంగా అందరూ అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలిచిత్రం గంగోత్రి అనుకుంటారు. అయితే గంగోత్రి కంటే ముందు అల్లు అర్జున్ ఓ సినిమా ఆగిపోయిందట. ఇటీవల ఆ విశేషాలను అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు ఆయన మాట్లాడుతూ ‘ యానిమేటర్‌గా స్థిరపడదామని కెనడాకు వెళ్లడానికి రెడీ అయిన తరుణంలో ఓ సినిమాలో నటిస్తే జీవితాంతం మెమెరబుల్గా వుంటుంది కదా అనిపించింది. తెలిసిన స్నేహితుల ద్వారా అవకాశం కూడా వచ్చింది.
మూడు నెలల్లో ఆ సినిమా పూర్తిచేసి కెనడా వెళ్లిపోవచ్చని డిసైడ్ అయ్యాను. కానీ ఎవో అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మొదలుకాకముందే ఆగిపోయింది. తొలిసినిమా అలా ఆగిపోవడం బాధ కలిగింది. అప్పటి నుంచి సినిమాల మీద శద్ధ్ర పెట్టాను. యానిమేటర్‌గా అయితే ఆ రంగంలో రాణించాలంటే ఎక్కువ టైమ్ పడుతుంది. నాకున్న నట వారసత్వంను వదిలి యానిమేటర్‌గా ఎందుకు వెళ్లాలి అనుకున్నాను. అది సరియైన నిర్ణయం కాదనిపించింది. ముందు ఓ సినిమాలో ప్రయత్నిద్దాం. సక్సెస్ కాకపోతే అప్పుడు ఆలోచిద్దాం అనుకున్నాను. ఇదే విషయాన్ని నాన్నకు చెప్పాను. ఆ తరువాత ముంబైలో కిశోర్ నమిత్కుమార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ పొందాను. కోర్సు పూర్తవగానే గంగోత్రిలో అవకాశం వచ్చింది’ అని చెప్పుకొచ్చారు