కీవ్: రష్యా క్షిపణి దాడిలో తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న ఈ 52 ఏండ్ల మహిళ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతున్నది. రష్యన్ సేనల హింసాకాండకు తార్కాణంగా ఉన్న ఈ దృశ్యం యావత్తు ప్రపంచాన్ని కదిలిస్తున్నది. ఈమె పేరు ఒలేనా కురిలో. ఒక ఉపాధ్యాయురాలు. 24వ తేదీన చుగేవ్ పట్టణంపై రష్యా జరిపిన దాడిలో గాయపడిన ఆమె శనివారం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ అదృష్టం కొద్దీ తాను ప్రాణాలతో బయటపడ్డానని, దేశం కోసం ఏమైనా చేస్తానని పేర్కొన్నారు.