తిరుమల : టీటీడీ(TTD) ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా ( Ex-officio member) తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి (Diwakar Reddy) శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దివాకర్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అదనపు ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో ప్రశాంతి, వీజీవో సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.