అమీర్పేట్, నవంబర్ 30 : ఎస్ఆర్నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బల్కంపేట ప్రకృతి చికిత్సాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు నోటు బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు మంగళవారం అందజేశారు. కౌన్సిల్ అధ్యక్షుడు కాసాని సహదేవ్గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కౌన్సిల్ ప్రతినిధులు అనంతరెడ్డి, లింగమయ్య, ప్రసాద్ దూబే, నారాయణరెడ్డి, యాదగిరి, కోడె రామలింగం, కోటేశ్వర్రావు, రాజలింగంగౌడ్, పండరయ్య, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.