కోదాడ, ఆగస్టు 12 : వేడుకల పేరిట డబ్బు వృథా చేయకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద పిల్లలకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు, పెన్నులు, బీరువా అందజేయడం అభినందనీయమని టీపీసీసీ డెలిగేట్, కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎన్ఆర్ఎస్ జూనియర్ కళాశాలల చైర్మన్ వడ్డే రాజేశ్ చౌదరి జన్మదినం సందర్భంగా చిన్నారులకు ఆయన పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శుభకార్యాలు, వేడుకల పేరిట డబ్బు వృథా చేయకుండా రాజేశ్ చౌదరిని ఆదర్శంగా తీసుకుని పేద పిల్లలకు ఉపయోగపడే సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ వేణుగోపాలరావు, ప్రిన్సిపాల్ జీవి అకాడమిక్ అడ్వైజర్ రామయ్య ఇన్చార్జి పీఎన్ఆర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.