హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 4: వరంగల్ జిల్లా అద్దె బస్సుల యజమానుల సంఘం, వరంగల్ జిల్లా హైర్ బస్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ యూనియన్ మధ్య నూతన వేతన ఒప్పందంపై చర్చలు సఫలమయ్యాయి. అద్దె బస్సు కార్మికుల సమస్యలపై స్పందించిన అద్దెబస్సు యజమానుల సంఘం ప్రతినిధులకు హైర్బస్ డ్రైవర్స్అండ్ క్లీనర్స్యూనియన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్‌ప్రెస్ బస్సు డ్రైవర్ (నెలలో 15 రోజులు మాత్రమే)కు నెలవారి వేతనంగా రూ.21 వేలు, పల్లెవెలుగు బస్సు డ్రైవర్స్ (నెలలో 15 రోజులు మాత్రమే)కు నెలవారి వేతనంగా రూ.20 వేల చొప్పున చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది.
దసరా పండుగ సందర్భంగా ప్రతి డ్రైవర్‌కు ‘ఇనామ’గా రూ.3,500 చెల్లించనున్నట్లు, సంవత్సరం పూర్తయిన డ్రైవర్స్‌కి మాత్రమే బోనస్ వర్తిస్తుందన్నారు. ప్రతి డ్రైవర్‌కు సంవత్సరానికి ఒకసారి రెండు జతల బట్టలు(యూనిఫామ్) ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. నైట్‌హాల్ట్ సర్వీసుల ప్రతి డ్రైవర్‌కు నైట్‌హాల్ట్ బత్తాగా రూ.150 చెల్లించనున్నట్లు, పీపీసీ పెట్టినా, ఆటోనగర్ గ్యారేజీ పనుల నిమిత్తం వెళ్లాల్సి వచ్చినా డ్రైవర్‌కు వేతనంతో కూడిన బత్తా చెల్లించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అద్దెబస్సుల ఓనర్స్అసోసియేషన్ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు రాంరెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ ఉన్నారు.