ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 29 : దివ్యాంగురాలిగా శాశ్వత గుర్తింపు కార్డు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు పెన్షన్ రాకుండా చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన ఓ మహిళ కలెక్టర్‌తో మొరపెట్టుకున్నది. మంగళవారం ఎల్లారెడ్డిపేటలో పోషక పదార్థాలపై మహిళలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ గరిమా అగ్రవాల్ హాజరయ్యారు. అయితే అక్కడికి వచ్చిన శివరాత్రి ఎల్లవ్వకు పుట్టుకతోనే పోలియో కారణంగా కుడిచేయి పనిచేయడం లేదు.
బీఆర్ఎస్ హయాంలో శాశ్వత గుర్తింపు కార్డు మంజూరు కాగా, పెన్షనే ఆధారంగా బతుకున్నది. నిరుడు డిసెంబర్లో కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మరో కార్డు ఇస్తామని చెప్పడంతో వెళ్లి కొత్త కార్డు తెచ్చుకున్నది. సదరు కార్డు గత డిసెంబర్ 23న ఇవ్వగా, తనకు పది నెలలుగా పెన్షన్ రావడం లేదని తెలిపింది. దీంతో పెన్షన్ పునరుద్ధరణకు కలెక్టర్ హామీ ఇచ్చారు.