Cinema News | గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం వంటి హిట్ చిత్రాలను అందించిన యువ దర్శకుడు విజయ్ కుమార్ కొండా త్వరలో ‘అహం’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఈ సినిమా ద్వారా సీనియర్ నిర్మాత కుమారుడు హీరోగా పరిచయం కానున్నాడు. నటుడు శివాజీ నెగెటివ్ ఛాయలున్న పాత్రను పోషించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ పొడక్షన్ వర్క్ జరుగుతున్నది. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించబోతున్న ఈ సినిమా వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.