స్క్రీన్‌ప్లే, విజువల్స్ పరంగా సినిమా కొత్తగా ఉంటుంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రెండు కాలాల వ్యవధుల్లో సాగుతుంది’ అని అన్నారు రాహుల్ సంకృత్యాన్. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్’. నాని హీరోగా నటించారు. ఈ నెల 24న విడుదలకానుంది. రాహుల్ సంకృత్యాన్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘సూపర్ నేచురల్, యాక్షన్, లవ్ అంశాల సమ్మిళితంగా సాగే చిత్రమిది.శ్యామ్‌సింగరాయ్ అనే సాహితీవేత్తగా, వాసు అనే ఆధునిక యువకుడిగా నాని రెండు భిన్న పార్శాలున్న పాత్రలో కనిపిస్తారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న సంబంధమేమిటన్నది ఆసక్తిని పంచుతుంది. అభినయానికి ఆస్కారమున్న పాత్ర కావడంతో నాని తప్ప నాకు మరో ప్రత్యామ్నాయం ఎవరూ కనిపించలేదు. నాని ఇమేజ్‌కు అనుగుణంగా ఆయన నుంచి అభిమానులు ఆశించే అన్ని హంగులు సినిమాలో ఉంటాయి. కథపై ఉన్న నమ్మకంతోనే నాని మార్కెట్‌కు మించి ఖర్చుచేశాం.సాయిపల్లవి ఈ సినిమా కోసం క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నది.
ఏడు రోజుల పాటు పగలంతా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ రాత్రిళ్లు షూటింగ్లో పాల్గొన్నది. కమర్షియల్ పంథాలో సాగే ఈ చిత్రం ఆనాటి సమాజంలో పేరుకుపోయిన దేవదాసి వ్యవస్థ తాలూకు చీకటి కోణాలను చూపించబోతున్నాం. ఈ దురాచారాన్ని రూపుమాపడానికి శ్యామ్‌సింగరాయ్ చేసే పోరాటం ఆకట్టుకుంటుంది. ప్రథమార్థంలో వచ్చే నాని, కృతిశెట్టి లవ్‌స్టోరీ ఆహ్లాదాన్ని పంచుతుంది. రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా కష్టపడి సినిమా చేశాం’ అన్నారు.