కొలంబో: శ్రీలంకలో ఒకవైపు అధ్యక్షుడు రాజపక్సకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నా.. మరోవైపు ఆ దేశ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో క్రికెట్ సిరీస్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా, వన్డే సిరీస్‌ను లంక గెలుచుకున్నాయి. ఇక టెస్ట్ సిరీస్ మాత్రం డ్రా అయ్యింది. అయితే రెండవ టెస్టులో లంక బ్యాట్స్‌మెన్ దినేశ్ చండీమాల్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో అతను డబుల్ సెంచరీ చేశాడు. ఇక మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అతనో భారీ సిక్సర్ కొట్టాడు. ఆ సిక్సర్ కాస్త స్టేడియం బయట పడింది. స్టేడియం బయట నడుచుకుంటూ వెళ్తున్న ఓ కుర్రాడికి ఆ బంతి తగిలింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు శ్రీలంకలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూడండి.
#SLvAUS #dineshchandimal pic.twitter.com/84Duro4bkg
— Jemi_forlife (@jemi_forlife) July 11, 2022