ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో రాష్ట్ర అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను గురువారం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆవిష్కరించారు. సాగు ఖర్చులు తగ్గించేందుకు వ్యవసాయశాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు. ఆగ్రోస్ ఎండీ రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘు నందన్‌రావు, కమిషనర్ హనుమంతు, అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజరత్నం, ప్రధాన కార్యదర్శి తిరుపతి, నాయకులు మధుమోహన్, నర్సింహారెడ్డి, కృష్ణవేణి, అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు పాల్గొన్నారు. -హైదరాబాద్,జనవరి 6 (నమస్తేతెలంగాణ)