Dhurandhar The Revenge | బాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా ట్రైలర్ను శనివారం (మార్చి 7) ఉదయం 11:01 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది (2025) బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా మరియు అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సారా అర్జున్ కీలక పాత్ర పోషిస్తోంది.
‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ మరియు టి-సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ మోస్ట్ ఎవైటెడ్ ‘రివెంజ్’ డ్రామా మార్చి 19, 2026న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. రేపు విడుదల కానున్న ట్రైలర్ ఈ యాక్షన్ విందును ఏ స్థాయిలో చూపించబోతుందోనని అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Brace yourself ⚔️
Trailer out tomorrow 7th March at 11:01 AM#DhurandharTheRevenge Releasing In Cinemas Worldwide on 19th March 2026 in Hindi, Telugu, Tamil, Kannada & Malayalam@rampalarjun @duttsanjay @ActorMadhavan #AkshayeKhanna #SaraArjun @bolbedibol @AdityaDharFilms… pic.twitter.com/RECbmOcODQ
— Ranveer Singh (@RanveerOfficial) March 6, 2026