Dhurandhar 2 Teaser | బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ధురంధర్ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్డేట్ వచ్చింది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ‘ధురందర్ 2’ (Dhurandhar 2) ఈ సినిమా రాబోతుండగా.. మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌కు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వెలువడింది. ఈ చిత్ర టీజర్‌ను పరిశీలించిన సెన్సార్ బోర్డు (CBFC) దీనికి ‘A’ (Adults Only) సర్టిఫికేట్‌ను జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సీక్వెల్‌కు ‘ధురందర్ 2 – ది రివెంజ్’ (Dhurandhar 2 – The Revenge) అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు సెన్సార్ సర్టిఫికేట్ ద్వారా క్లారిటీ వచ్చింది. 1 నిమిషం 48 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌ను జనవరి 23న విడుదలవుతున్న సన్నీ డియోల్ బోర్డర్ 2 సినిమాతో థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సీక్వెల్‌ను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. మొదటి భాగం ముగింపులో వచ్చే ఎండ్-క్రెడిట్ సీక్వెన్స్‌ను రీ-ఎడిట్ చేసి ఈ రెండో భాగం టీజర్‌గా రూపొందించినట్లు సమాచారం. ఈ చిత్రంలో రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ మరియు రాకేష్ బేడీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించబోతున్నారు. ‘ధురందర్ 2’ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇదే సమయంలో కన్నడ స్టార్ యాష్ నటిస్తున్న ‘టాక్సిక్’ (Toxic) కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొననుంది. కేవలం టీజర్‌కే ‘A’ సర్టిఫికేట్ రావడంతో, సినిమాలో యాక్షన్, హింసాత్మక దృశ్యాలు ఏ స్థాయిలో ఉంటాయోనని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు.