Sambala | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ గత కొంతకాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ప్రయోగాలు చేసినా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన ఆది.. ఫైనల్‌గా శంబాల (Shambala) సినిమాతో తనకు కావాల్సిన బ్రేక్‌ను అందుకున్నాడు. గత ఏడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంది.దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించిన శంబాల.. సంప్రదాయ భక్తి భావనకు, సస్పెన్స్ నిండిన కథనానికి మిళితంగా రూపొందింది.
థియేటర్లలో పెద్దగా హడావిడి లేకుండా రిలీజైనప్పటికీ.. కంటెంట్ పరంగా మంచి టాక్ తెచ్చుకుని, ముఖ్యంగా మల్టీప్లెక్స్ ప్రేక్షకులు మరియు థ్రిల్లర్ లవర్స్‌ను మెప్పించింది. కథలోని మిస్టరీ ఎలిమెంట్స్, డివోషనల్ టచ్, ఆది సాయికుమార్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. శంబాల డిజిటల్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. ఈ రోజు నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. అయితే ఓ ప్రత్యేక నిబంధనతో ఆహా ఈ సినిమాను రిలీజ్ చేసింది. ప్రస్తుతం శంబాల సినిమాను ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లు మాత్రమే వీక్షించే అవకాశం ఉంది. సాధారణ సబ్స్క్రైబర్లకు మాత్రం రేపటి నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. దీంతో గోల్డ్ యూజర్లకు ఒకరోజు ముందుగానే ఈ థ్రిల్లర్‌ను చూసే ప్రత్యేక అవకాశం లభించింది.
థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులకు, అలాగే డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడేవారికి శంబాల మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఆది సాయికుమార్ కెరీర్లో కీలకమైన సినిమాగా నిలిచిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. గోల్డ్ యూజర్లు అయితే ఈరోజే చూసి ఎంజాయ్ చేయండి, మిగతావాళ్లు మాత్రం రేపటి వరకు కొద్దిగా వెయిట్ చేయాల్సిందే.