హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అవినీతికి కేరాఫ్‌గా మారింది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) కార్యాలయంలో ఇటీవల వెలుగు చూసిన వరుస ఘటనలే ఇందుకు సాక్ష్యం. ‘ఏవో ప్రమోషన్లలో గోల్మాల్!’, ‘డీహెచ్ విభాగంలో షాడోలు సాగించిన వసూళ్ల దందా’ కథనాలను మరువక ముందే మరో బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. డీహెచ్ విభాగంలో స్టాఫ్‌నర్సులు, అటెండర్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ మహిళా అడిషనల్ డైరెక్టర్, ఇద్దరు ఇతర అధికారులు నమ్మబలికారు. స్టాఫ్‌నర్సు ఉద్యోగానికి రూ.5 లక్షలు, అటెండర్ ఉద్యోగానికి రూ.2.5 లక్షల చొప్పున రేటు ఫిక్స్ చేసి డబ్బులు దండుకొన్నారు.
అధికారుల మాటలు నమ్మి స్టాఫ్‌నర్సు, అటెండర్ ఉద్యోగాల కోసం ఆరుగురు అభ్యర్థులు విడతలవారీగా ఒక్కొక్కరు రూ.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు మొత్తంగా రూ.19.5 లక్షలు ఫోన్ పే, అకౌంట్ ట్రాన్స్ఫర్, క్యాష్మోడ్లో చెల్లించారు. 2024 జనవరి నుంచి అదే ఏడాది మార్చి వరకు ఈ లావాదేవీలు జరిగినట్టు తెలిసింది. డబ్బులు చెల్లించిన వారు తమకు ఉద్యోగాలు ఎప్పుడొస్తాయని అడిగితే, అప్పుడు ఇప్పుడూ అంటూ కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన సూర్యాపేటకు జిల్లాకు చెం దిన ఓ బాధితురాలి భర్త హైదరా బాద్‌లోని ఓ పోలీసు స్టేషన్లో ఫిర్యా దు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పి స్తామని నమ్మబలికి తమతోపాటు అమాయకుల వద్ద నుంచి మొత్తం రూ.19.5 లక్షలు వసూలు చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము అధి కారులతో చేసిన ఆర్థిక లావాదేవీల వివ రాలను ఫిర్యాదుకు జత చేశారు. దీంతో పోలీసులు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ విభా గంలోని మహిళా అడిషనల్ డైరెక్ట ర్ సహా మరో ఇద్దరు అధికారులపై 406, 420, రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు.