Mahishasura mardini : నేటి అలంకారం మహిషాసుర మర్దినీ దేవి

మహిష మస్తక నృత్త వినోదినీ స్ఫుటరణన్మణి నూపుర మేఖలా
జనన రక్షణ మోక్ష విధాయినీ జయతి శుంభనిశుంభ నిషూదినీ॥
లోక కంటకుడైన మహిషాసురుణ్ని సంహారం చేసిన మహోగ్రరూపం ఇది. సకల దేవీదేవతల శక్తులన్నీ ఈ తల్లిలో మూర్తీభవించి ఉంటాయి. దివ్య తేజస్సుతో, అనేక ఆయుధాలు ధరించి, సింహ వాహినియై దర్శనమిస్తుంది. ఈమె అనుగ్రహం కలిగితే సాధించలేనిది ఏదీ లేదు. మహిషాసుర సంహారం జరిగిన నవమి రోజునే ‘మహర్నవమి’గా జరుపుకోవటం ఆచారంగా వస్తున్నది. ఈ రోజున చండీదేవిని పూజించిన వారికి శత్రుభయం ఉండదు. అన్నిటా విజయం కలుగుతుంది. ఈ రోజు అమ్మవారిని యథాశక్తి పూజించి పానకం, వడపప్పు, గారెలు, పులిహోర, పాయసాన్నం నివేదన చేయాలి. అమ్మవారి స్వరూపంగా సువాసినులకు పూజ చేసి, మంగళద్రవ్యాలు, పసుపు కుంకుమలు, శక్తికొద్దీ నూతన వస్ర్తాలు ఇవ్వాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

