ఉప్పల్, నవంబర్ 15 : జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గత ఆరు నెలల్లో (ఏప్రిల్ 2021- సెప్టెంబర్) వరకు వివిధ అభివృద్ధి పనులకు రూ.13.28 కోట్లు మంజూ రయ్యా యి. ఈ నిధులతో కాప్రా, ఏఎస్‌రావునగర్, చర్లపల్లి, హెచ్‌బీకాలనీ, మల్లాపూర్, నాచారం డివిజన్ల పరిధిలో 74 ప్రగతి పనులు చేపట్టారు. సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, స్టార్మ్‌వాటర్ డ్రెయిన్లు, నాలాల పూడికతీత, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణం చేపట్టారు. వీటిలో రూ.4.18కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు పూర్తికాగా, రూ.3.44కోట్లతో చేపట్టిన 15 పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.4.67కోట్లతో చేపట్టాల్సిన 18పనులు టెండర్ ప్రక్రియలో ఉన్నాయి. రూ.99.5లక్షలతోచేపట్టే పనులు ప్రారంభించాల్సి ఉంది.
ప్రతిపాదనలు.. టెండర్లు… పనులు
సర్కిల్ పరిధిలోని ఆరు డివిజన్లలో రూ.3.28 కోట్లతో 19 సీసీ రోడ్ల పనులు చేపట్టగా.. వీటిలో రూ.2.28కోట్ల విలువైన 10 పనులు పూర్తయ్యాయి. రూ.10లక్షలతో ఓ సీసీ రోడ్డు పని కొనసాగుతుండగా, రూ.15.50 కోట్లతో చేపట్టాల్సిన 7 సీసీ రోడ్ల పనులు టెండర్ ప్రాసెస్‌లో ఉన్నాయి. రూ.38.6లక్షలతో రెండు బీటీరోడ్డు పనులు చేపట్టగా, వీటిలో ఓ బీటీ రోడ్డు పని పూర్తికాగా, మరో పని టెండర్ ప్రక్రియలో ఉంది. 7 స్టార్మ్‌వాటర్ డ్రెయిన్ల నిర్మాణం కోసం రూ.3.55 కోట్లు మంజూరు కాగా వీటిలో రూ.75లక్షలతో చేపట్టిన రెండు డ్రెయిన్లు పూర్తయ్యాయి. రూ.2.68కోట్ల పనులు టెండర్ ప్రక్రియలో ఉండగా, మరో పని చేపట్టాల్సి ఉంది. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు రూ.1.59కోట్లు మంజూరు కాగా, రూ.37.20లక్షల విలువైన రెండు పనులు పూర్తయ్యాయి. రూ.48.50లక్షలతో చేపట్టిన యూజీడీ పని కొనసా గుతుండగా, రూ.73లక్షలతో చేపట్టే రెండు పనులు టెండర్ ప్రాసెస్‌లో ఉన్నాయి. సర్కిల్ పరిధిలో రూ.75.66లక్షలతో నాలాల డీసిల్టింగ్ పనులు చేపట్టగా అవి కొనసాగుతున్నాయి. కమ్యూనిటీహాల్ నిర్మాణం కోసం రూ.24.5 లక్షలు మంజూరుకాగా, నిర్మాణం కోసం చర్యలు ప్రారంభించారు.
నిరంతరాయంగా అభివృద్ధి పనులు
కాప్రా సర్కిల్లో అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో ఇందుకోసం రూ.13.28 కోట్లు మంజూరు కాగా, 74 అభివృద్ధి పనులు చేపట్టాం. వీటిలో 35 పనులు పూర్తికాగా 15 పనులు కొనసాగుతున్నాయి. 18 పనులు టెండర్ల ప్రక్రియలో ఉండగా, మిగతా ఆరు పనులు చేపట్టాల్సి ఉంది. -కోటేశ్వర్రావు, ఈఈ, కాప్రా సర్కిల్